Mohan Bhagwat: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Mohan Bhagwat: మాపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
Mohan Bhagwat: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై rss చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. స్వార్థంతోనే ఆర్ఎస్ఎస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికోసం అయితే రిజర్వేషన్‌లు కేటాయించబడ్డాయో.. వారి అభివృద్ధి జరిగే వరకు రిజర్వేషన్‌లు కొనసాగించాల్సిందేనని మోహన్ భగవత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వివాదం సృష్టించి లబ్ది పొందాలని కొందరు అనుకుంటున్నారు. దాంతో ఆర్ఎస్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.