నేడు కొడంగల్, నాగర్‌కర్నూలులో రేవంత్ పర్యటన
Revanth Reddy: ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నేడు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాలుగు రోజులుగా అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతూ.. ర్యాలీల్లో, పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటూ.. కార్యకర్తల్లో.. జోష్ నింపుతున్నారు.ఇందులో భాగంగా నేడు కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో బావోజీ జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం బిజినేపల్లిలో బహిరంగ సభకు హాజరుకానున్నారు.