Revanth Reddy: కామారెడ్డి తీర్పును దేశప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు
Revanth Reddy: కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్
Revanth Reddy: కామారెడ్డి ప్రజలు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించబోతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బీసీ డిక్లరేషన్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణతోపాటు.. దేశంలోని ఐదురాష్ట్రాల్లో ప్రజలు కామారెడ్డి ఇవ్వబోయే తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి, పౌరుషానికి మారుపేరుగా నిలిచిన కామారెడ్డి ప్రజలు.. పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు.