Revanth Reddy: ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ

Revanth Reddy: కాసేపట్లో సోనియా, రాహుల్‌తో భేటీకానున్న రేవంత్

Update: 2023-12-06 05:50 GMT

Revanth Reddy: ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను బిజీ బిజీగా ఉన్నారు.రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందరినీ పేరు పేరునా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలతో భేటీ అయ్యారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు రేవంత్ రెడ్డి. కేసీ వేణుగోపాల్‌తో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడానికి వెళ్లారు. అనంతరం సోనియాగాంధీతో భేటి కానున్నారు.

తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా హైకమాండ్ పెద్దలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక డిప్యూటీ డీకే శివకుమార్, మాణిక్కం ఠాకూర్‌లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. బుధవారం పార్టీ పెద్దలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. పార్టీ పెద్దలందరినీ తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.

Tags:    

Similar News