Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకే కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారు
Revanth Reddy: మోడీ ఆదేశాల మేరకే యూపీయే భాగస్వామ్య పక్షాలను చీల్చే కుట్ర జరుగుతోంది
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ ఆదేశాల మేరకు యూపీఏలోని భాగస్వామ్య పక్షాలను చీల్చి బీజేపీకి అనుకూలం చేసేందుకే కేసీఆర్ పూనుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారే ఒక్కటే నినాదంతో పనిచేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి.