టీఆర్ఎస్‌లో చేరిన రావుల శ్రీధ‌ర్ రెడ్డి

నిన్న బీజేపీకి రాజీనామా చేసిన శ్రీధర్ రెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరారు..మంత్రి కేటీఆర్ సమక్షంలో అయన టీఆర్ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ రెడ్డికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు

Update: 2020-11-02 08:48 GMT

నిన్న బీజేపీకి రాజీనామా చేసిన శ్రీధర్ రెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరారు..మంత్రి కేటీఆర్ సమక్షంలో అయన టీఆర్ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ రెడ్డికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. శ్రీధర్ రెడ్డితో పాటుగా వందల మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ర్టానికి అండ‌గా ఉండే పార్టీ టీఆర్ఎస్ మాత్ర‌మేనని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నో ఎజెండాలు ఉంటాయని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నది ఒకే రాష్ట్రం, ఒకే అజెండా అని అన్నారు. బీజేపీ కేవలం భ్రమలు కలిపించే ప్రయత్నం చేస్తోందని, తెలంగాణ బాగు కోసం కట్టుబడేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.

ఇక కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని దేశమంతా ఎదురుచూస్తుందని అన్నారు కేసీఆర్.. ఈ ఆరేళ్ల‌లో ఎక్క‌డ ఏ ఎన్నిక వ‌చ్చినా.. కేసీఆర్ నాయ‌క‌త్వానికే జై కొడుతున్నారని కేటీఆర్ అన్నారు. అటు శ్రీధర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటి చేసి ఓడిపోయారు. 

Tags:    

Similar News