Rajanna Sircilla: పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలి.. పెట్రోల్‌ బాటిల్‌ తో నిరసన..

Rajanna Sircilla: కొత్త వారికి అవకాశమిస్తే ఉపాధి కోల్పోతామని ఆందోళన

Update: 2024-09-26 10:11 GMT

Rajanna Sircilla: పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలి.. పెట్రోల్‌ బాటిల్‌ తో నిరసన..

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ షాప్ నిర్వాహకులు పెట్రోల్ బాటిళ్లతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలోని 58 రేషన్ షాపులకు ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా తాము రేషన్ షాప్‌లో పనిచేస్తున్నామని చెప్పారు.

కరోనా టైమ్‌లోనూ పనిచేస్తే తమకు తెలియకుండానే ఇప్పుడు తొలగించారని అన్నారు. రేషన్ షాప్‌ల నిర్వహణ నుంచి తమను తొలగిస్తే ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామంటూ తెలిపారు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బుజ్జగించి కిందికి దింపే ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News