Raja Singh: తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోంది
Raja Singh: కేసీఆర్ మోసగాడు.. కేటీఆర్ పెద్ద మోసగాడు
Raja Singh: తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోం దన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.... ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలంతా అవినీతిపరులేనని ఆరోపించారాయన. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ మూడు పార్టీలు ఒక్కటేనని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మోసగాడైతే కేటీఆర్ పెద్ద మోసగాడని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారని విరుచుకుపడ్డారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణను గెలిపించాలని రాజాసింగ్ కోరారు.