Rain Alert in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Heavy Rain Alert in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి బారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం బలహీనపడుతుందని దీని ప్రభావం వల్ల ఛత్తీస్ గడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు ఐఎండీ వివరించింది.
దీని ప్రభావం వల్ల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంగనర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 123.3 మి. మీ. సూర్యపేట జిల్లా టేకుమట్లలో 56.5 మి.మీ ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్ లో 46, వరంగల్ జిల్లా ఏనుగుల్ లో 45, సంగారెడ్డి జిల్లా మాల్ చెల్మలో 44.8 కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ అధికారులు తెలిపారు.