Rain Alert: ఒక్క వర్షానికే హైదరాబాద్లో నరకం.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు
Hyd Rain: హైదరాబాద్ లో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం తడిసిముద్దైంది. దాదాపు గంటపాటు వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Hyd Rain: హైదరాబాద్ లో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం తడిసిముద్దైంది. దాదాపు గంటపాటు వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శనివారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి కుండపోత వర్షం కురవడంతో నగరమంతా జలమయమయ్యింది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన సమయంలో వర్షం పడటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఓ వైపు వర్షం మరోవైపు రూడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో నరకం చూశారు. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, నారాయణ గూడ, ఉప్పల్, సుచిత్ర, అల్వాల్, బోయిన్ పల్లి, తోపాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఖైరతాబాద్ లో వర్షం పడింది. దీంతో ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్జ్ జారీ చేసింది. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని..అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ హెచ్చరించింది. సెప్టెంబర్ 22న ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
సెప్టెంబర్ 23వ తేదీన ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అటు ఏపీలోని పలు ప్రాంతాలతోపాటు రాయలసీమలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.