Rahul Gandhi: దూకుడు పెంచిన కాంగ్రెస్.. నేటి నుంచి తెలంగాణలో రాహుల్ పర్యటన
Rahul Gandhi: జుక్కల్, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తిలో ప్రచారం
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. జాతీయ నేతలు వరుసగా తెలంగాణకు క్యూ కడుతున్నారు. నేటి నుంచి తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ ఇవాళ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. రాహుల్ ముందుగా నాందేడ్ నుంచి హెలికాఫ్టర్‌లో బోధన్ సభకు చేరుకొనున్నారు. అనంతరం ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాహుల్ ఎన్నికల ప్రచారం ముగించుకొని హెలికాఫ్టర్ బేగంపేటకు చేరుకుంటారు. రేపు ఆందోల్, సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్, కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్ రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు ప్రియాంక పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి ప్రియాంక ఢిల్లీకి వెళ్లనున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నగరంలోని పలు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ,కార్నర్ మీటింగ్‌లలో డీకే శివకుమార్ పాల్గోనున్నారు.