Rahul Gandhi: కాంగ్రెస్ దయతోనే కేసీఆర్ సీఎం అయ్యారు
Rahul Gandhi: కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకున్నారు
Rahul Gandhi: తెలంగాణాలో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి దొరల ప్రభుత్వం నడుపుతున్నాయని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. భూరికార్డుల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్.. తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ దయతోనే కేసీఆర్ సీఎం అయ్యారని రాహుల్ పేర్కొన్నారు.