రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక.. 6 గ్యారెంటీల మేనిఫెస్టోకు ప్రత్యేక పూజలు
Ramappa Temple: రేపు కరీంనగర్, ఎల్లుండి నిజామాబాద్‌లో రాహుల్ టూర్
Ramappa Temple: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో 6 గ్యారెంటీ స్కీముల మేనిఫెస్టోను శివుడి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. సాయంత్రం ములుగుకు యాత్ర చేరుకోనుండగా.. అక్కడ నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు రాహుల్, ప్రియాంక. మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర జరగనుంది.