Puvvada Ajay Kumar: నేను లెటెస్ట్ వర్షన్ ఐ ఫోన్ లాంటి వాడిని.. తుమ్మల ఓల్డ్ వర్షన్ ఐ ఫోన్ లాంటి వాడు
Puvvada Ajay Kumar: ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
Puvvada Ajay Kumar: తండ్రి సీఎం అయితే 3 వేల కోట్ల నిధులు తెచ్చి... ఖమ్మాన్ని అభివృద్ధి చేశానని, కొడుకు సీఎం అయితే ఖమ్మానికి 30 వేల కోట్ల రూపాయలు తీసుకొస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలోని 58వ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తాను ఐ ఫోన్ లెటెస్ట్ వర్షన్ లాంటి వాడినని, తుమ్మల పాత వర్షన్ ఐ ఫోన్ లాంటి వాడని, పాత వర్షన్ ఐ ఫోన్ మనకెందుకు వద్దు అంటూ ఎద్దేవా చేశారు. అంతే కాకుండా తాను రూపాయి నాణం వాటి వాడినని.. మార్కెట్‌లో చెల్లుతుందని, తుమ్మల డాలర్ లాంటి వాడని, డాలర్ ఖమ్మం మార్కెట్‌లో చెల్లదంటూ మరోసారి ఎద్దేవా చేశారు. ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అజయ్ కోరారు.