నేడు, రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్ పర్యటన
Telangana: మ.12 గం.లకు పాలకుర్తి, 1:30 గంటలకు హుస్నాబాద్‌లో ప్రచారం
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ జోరు పెంచింది. నేటి నుంచి తెలంగాణలో రెండ్రోజుల పాటు ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ప్రియాంక గాంధీ పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొననున్నారు. రాత్రికి ఖమ్మంలో బస చేసి రేపు పాలేరు, సత్తుపల్లి, మధిర ప్రచార సభలో పాల్గొననున్నారు. అనంతరం గనవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కార్నర్ మీటింగ్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, అంబర్‌పేట నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. రేపు హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు.