Praneeth Rao Case: పాపాల చిట్టా.. హార్డ్‌డిస్కులను వికారాబాద్‌ అడవిలో పడేసిన ప్రణీత్‌రావు

Praneeth Rao Case: SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు

Update: 2024-03-19 05:33 GMT

Praneeth Rao Case: పాపాల చిట్టా.. హార్డ్‌డిస్కులను వికారాబాద్‌ అడవిలో పడేసిన ప్రణీత్‌రావు

Praneeth Rao Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ధ్వంసం చేసిన 42 హార్డ్ డిస్కులను వికారాబాద్ ఫారెస్ట్‌లో పడేసినట్లు ప్రణీ‌త్‌రావు వెల్లడించాడు. ప్రణీత్‌ టీమ్‌లో పనిచేసిన ఓ సీఐని నిన్న పోలీసులు ప్రశ్నించారు. మరి కొందరిని ఈ రోజు విచారణకు పిలిచే అవకాశం ఉంది.

కోర్టు అనుమతితో ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. నిఘా సమాచారం ధ్వంసంపై విచారణాధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రత్యేకంగా కొన్ని హార్డ్‌డిస్కులనే ఎందుకు ధ్వంసం చేశారనే కోణంలో ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.

ఇవాళ మరో నలుగురు ఎస్సైలను విచారించే అవకాశం ఉంది. ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌లను ప్రణీత్‌రావుతో పోలీసులు రికవరీ చేయించనున్నారు. మొత్తం 15 మంది పని చేసినట్టు ప్రణీత్ చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తనతో పని చేసిన అధికారులకు.. ప్రమోషన్ ఆశ చూపించి పని చేయించుకున్నాడు ప్రణీత్‌రావు.

Tags:    

Similar News