Ponnam Prabhakar: పది రోజుల్లో వీఆర్‌ఏల డిమాండ్లను పరిష్కరించాలి
Ponnam Prabhakar: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ
Ponnam Prabhakar: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. పది రోజుల్లో VRAల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2017లో అసెంబ్లీ సాక్షిగా VRAలకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలన్నారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని గతంలో చెప్పారని గుర్తుచేశారు పొన్నం ప్రభాకర్. నేటికీ 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ సీఎం ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. కాబట్టి ఇప్పటికైనా సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ VRAల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్.