Hyderabad: జంటనగరాల ప్రజలకు పోలీస్ శాఖ వార్నింగ్..అలాంటివి నిర్వహిస్తే తాట తీస్తాం
144 Section in Hyderabad:
144 Section in Hyderabad: తెలంగాణలో నేడు 144 సెక్షన్ అమల్లో ఉంది. హైదరాబాద్ -సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో కఠిన నిబంధనలను ఉంటాయని పోలీసు శాఖ నోటీసులను జారీ చేసింది. ఈ 24 గంటల్లో ఎలాంటి ధర్నాలు, నిరసనలు, ఆందోళనలను చేపట్టకూడదని హెచ్చరించింది. అలా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.
ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బామ్మర్థి ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని..కేటీఆర్ బామ్మర్ది సోదరుడికి చెందిన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ దగ్గర పోలీసులు నిర్వహించిన నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిస్తారని పోలీసు శాఖ ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నేడు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు నగరాల్లో ఎలాంటి ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు ముందస్తు హెచ్చరిక చేశారు. జంటనగరాల పరిధిలో కఠిన నిబంధనలు ఉంటాయని పోలీసులు శాఖ తెలిపింది. ఈ 24 గంటల్లో ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే తాట తీస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.