PM Modi: ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాని మోడీ బహిరంగ సభ
PM Modi: ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా క్రషర్ గ్రౌండ్‌లో మోడీ ప్రచారం
PM Modi: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా స్థానిక క్రషర్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు నేడు మోడీ హాజరుకానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తవగా.. సుమారు లక్షమంది బీజేపీ కార్యకర్తలు తరలిరానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని ఏడు నియెజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కూడా హాజరవుతారు.