Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు

Ponnam Prabhakar: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోకుండా పోయింది

Update: 2023-11-09 08:48 GMT

Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు

Ponnam Prabhakar: బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ నియోజకవర్గం వెనుకబడిందని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు తండాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్ధత వల్ల హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తప్ప, రాష్ట్రంలో చిన్న గ్రామాలు అభివృద్ధి జరగలేదన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్తాన్నారని తెలిపారు.

Tags:    

Similar News