Uttam Kumar: బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Uttam Kumar: రేపు కోదాడ, హుజూర్ నగర్ లలో రోడ్ షో, కార్నర్ మీటింగ్స్
Uttam Kumar: సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి, భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మల్యే చందర్ రావుతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబసభ్యులు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పా్ల్గొన్నారు. ముందు ఇంట్లో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన పద్మావతి రెడ్డి దంపతులు... నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సునామీ మొదలయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని అన్నిరకాలుగా మోసిందని విమర్శించారు. రేపు సాయంత్రం 4 గంటలకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, కోదాడ, హుజూర్ నగర్ లలో రోడ్ షో, కార్నర్ మీటింగులలో పాల్గొంటారని తెలిపారు.