Congress: రేపు గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం
Congress: సమావేశానికి హాజరుకానున్న టీపీసీసీ కొత్త కమిటీ సభ్యులు
Congress: రేపు గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది. సమావేశానికి టీపీసీసీ కొత్త కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఏఐసీసీ చేపట్టే కార్యక్రమాల అమలు కార్యక్రమాలపై చర్చించనున్నారు.సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో భేటీపై ఉత్కంఠ నెలకొంది. అయితే రేపు జరిగే పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని బహిష్కరించాలని సీనియర్‌లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.