Aasara Pension: తెలంగాణలో ఈ నెల పాత పెన్షనే..?

Aasara Pension: అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ

Update: 2024-01-24 03:42 GMT

Aasara Pension: తెలంగాణలో ఈ నెల పాత పెన్షనే..?

Aasara Pension: తెలంగాణలో ఆసరా పెన్షన్‌‌దారులకు ఈ నెల కూడా పాత పెన్షన్ అందనుంది. ఈ నెల పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని చెప్పింది కాంగ్రెస్. అయితే హామీపై స్పష్టత లేనందున పాత తరహాలోనే పెన్షన్లు ఇస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్లసొమ్ము జమ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సాధారణ పింఛను 2 వేల 16 రూపాయలు, దివ్యాంగులకు 3 వేల 16 రూపాయలు ఇస్తున్నారు.

అయితే కాంగ్రెస్ చేసిన హామీల్లో సాధారణ పింఛను 4 వేల రూపాయలు, దివ్యాంగులకు 6 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అభయహస్తం ఆరు గ్యారంటీలు పథకాలు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోంది.

ఒక్కో పథకానికి లక్షల్లో దరఖాస్తులు రావడంతో వాటి డేటాను ఎంట్రీ చేస్తున్నారు. తర్వాత అర్హత కలిగిన వారిని గుర్తించి వారికి పథకాలను అందించనున్నారు. ఈ మొత్తం వ్యవహారం అవ్వడానికి ఇంకా కొంత సమయం పట్టనుంది. అందువల్లనే కొత్త పింఛన్ల హామీని ఇంకా మొదలుపెట్టలేదని అధికారులు చెబుతున్నారు. మొత్తం పథకాలు అన్నీ ఒకేసారి అమల్లోకి వస్తాయని అప్పటి నుంచే పింఛన్ల పెంపు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News