KTR: హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు... హైదరాబాద్‌ను బాగు చేసే ఆలోచనలు చేయాలి
KTR: వస్తువులను కూడా తీసుకోనివ్వకుండా కూల్చివేస్తున్నారు
KTR: హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు...హైదరాబాద్‌ను బాగు చేసే ఆలోచనలు చేయాలని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనీసం వారి వస్తువులను కూడా తీసుకోనివ్వకుండా పోలీసులను పెట్టి కూల్చివేస్తున్నారని గరమయ్యారు. తమ హయాంలోనే కాదు.. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ ఫుట్‌పాత్ మీద ఆక్రమణ జరుగుతూనే ఉన్నాయని, వాటిపై వ్యాపారాలు చేసుకునేది ఏ దిక్కూలేని పేద ప్రజలే కదా అని ప్రశ్నించారు కేటీఆర్.
ఉద్దేశం మంచిదే అయినా.. ఫుట్‌పాత్ అక్రమణలు తొలగించాలంటే మానవీయ కోణంలో ఆలోచించి వారిని వెండింగ్ జోన్‌లకు తరలించాలని డిమాండ్ చేశారు. మూసీ అక్రమణల తొలగింపు విషయంలోనూ.. నిర్వాసితులకు ముందుగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చాకే.. కూల్చివేతలు చేయాలని కండీషన్ పెట్టారు కేటీఆర్. అమానవీయ కూల్చివేతలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు.