BRS: కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు షాక్.. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

BRS: ఛైర్మన్ రేసులో వైస్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Update: 2024-03-12 07:45 GMT

BRS: కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు షాక్.. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

BRS: కామారెడ్డి బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నిట్టూ జాహ్నవిపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు తీర్మానం నోటీసు అందించారు. మున్సిపల్ చైర్మన్ స్థానం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 23 మంది కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, ఆరుగురు స్వతంత్రులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు.

రాష్ర్టంలో మారిన రాజకీయ పరిస్థితులతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కౌన్సిలర్లు చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 27కు చేరింది. బీఆర్ఎస్‌కు 16 మంది, బీజేపీలో ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. 34 మంది కౌన్సిలర్ల కోరం హాజరైతే అవిశ్వాస ప్రక్రియ జరుగుతుంది. మరికొంత మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు చేస్తుంది. చైర్మన్ రేసులో ప్రస్తుత వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఉన్నారు.

Tags:    

Similar News