Nirmal: జిల్లా రాంనగర్ ఆశ్రమ పాఠశాలలో... అస్వస్థతకు గురైన స్టూడెంట్స్.. ఆసుపత్రికి తరలించారు

Nirmal: బోదకాల మాత్రలు తీసుకున్న 10 మంది స్టూడెంట్స్ సిక్

Update: 2023-08-25 10:50 GMT

Nirmal: జిల్లా రాంనగర్ ఆశ్రమ పాఠశాలలో... అస్వస్థతకు గురైన స్టూడెంట్స్.. ఆసుపత్రికి తరలించారు

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజుల క్రితం విద్యార్థినీలకు బోదకాల మాత్రలను ఇవ్వగా... అదే రోజు సాయంత్రం సుమారు పది మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఆ సాయంత్రం వారిని హాస్టల్ కు పంపించేశారు. ఆ మరుసటి రోజు ఉదయం అల్పాహారం తిన్న తరువాత మళ్లీ వాంతులు కావడంతో స్టూడెంట్స్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని వైద్యులు అంటున్నారు.

Tags:    

Similar News