Narendra Modi: కేసీఆర్‌ను పర్మినెంట్‌గా ఫామ్‌హౌస్‌కు పంపిస్తాం
Narendra Modi: అనేక స్కామ్‌లు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
Narendra Modi: అనేక స్కామ్‌లు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. గజ్వేల్ ప్రజలను కేసీఆర్ మోసం చేసి.. కామారెడ్డికి పారిపోయారని విమర్శించారు. ఈటల చేతిలో ఓడిపోతారనే కేసీఆర్ కామారెడ్డి వెళ్లారని ప్రధాని ఎద్దేవా చేశారు. తూప్రాన్‌లో బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న మోడీ.. ఫామ్‌హౌస్ సీఎం మనకు అవసరమా..? అంటూ ప్రశ్నించారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి, సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి అవసరమా? అని తెలుగులో మాట్లాడారు మోడీ. పదేళ్లుగా ఫామ్‌హౌస్ నుంచి పాలిస్తున్నారు, కేసీఆర్‌ను పర్మినెంట్‌గా ఫామ్‌హౌస్‌కు పంపిస్తామన్నారు మోడీ.