Nagarjuna: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు

Nagarjuna: హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్‌

Update: 2024-08-24 08:47 GMT

Nagarjuna: ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్..

Nagarjuna: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత అన్యాయమంటూ ఎక్స్‌లో స్పందించిన హీరో అక్కినేని నాగార్జున.. హైకోర్టును ఆశ్రయించారు. కన్వెన్షన్‌ కూల్చివేతపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కూల్చివేతకు ముందు హైడ్రా నోటీసులివ్వలేదని పిటిషన్‌‌లో పేర్కొన్న నాగార్జున..హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను ఆగస్టు 24న దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇది నాగార్జునకు ఊరటనిచ్చింది.

Tags:    

Similar News