Nadendla Manohar: కూకట్‌పల్లిలో జనసేన జెండా ఎగరవేయాలి
Nadendla Manohar: ప్రేమకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ అసెంబ్లీకి పంపాలి
Nadendla Manohar: కూకట్‌పల్లిలో జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. కూకట్‌పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ కృషి చేయాలన్నారు. ప్రేమకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి.. తెలంగాణ శాసనసభకు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలిసి పవన్ రోడ్ షో నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. కూకట్‌పల్లి జనసేన ఆఫీస్‌లో ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై నాదెండ్ల సమావేశమయ్యారు.