Malla Reddy: రాబోయే రోజుల్లో ముదిరాజ్‌లను మంత్రులుగా చూస్తారు
Malla Reddy: బలమైన ముదిరాజ్ నాయకులను తయారుచేస్తున్నా
Malla Reddy: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ముదిరాజ్ మహాసభ ఆధ‌్వర్యంలో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ‌్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సామాజిక వర్గం ఎదగాలని.. ప్రతిఒక్కరి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణకు బలమైన ముదిరాజ్ నాయకులను తయారుచేస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ముదిరాజ్‌లను మంత్రుల హోదాలో చూస్తామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.