కేటీఆర్ కు అర్వింద్ సవాల్.. తప్పని నిరూపిస్తే దేనికైనా సిద్ధం..

Dharmapuri Arvind: తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిప్పులు చెరిగారు.

Update: 2022-04-21 15:30 GMT
MP Dharmapuri Arvind Open Challenge To Minister KTR

కేటీఆర్ కు అర్వింద్ సవాల్.. తప్పని నిరూపిస్తే దేనికైనా సిద్ధం..

  • whatsapp icon

Dharmapuri Arvind: తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కు పశ్చిమ్బాట్ లాంటి నాటు వైద్యం అవసరమని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేంద్రప్రభుత్వం 3 లక్షల 94 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, ఇది తప్పని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అర్వింద్ సవాల్ చేశారు. రైస్ మిల్లుల్లో అవకతవకలు జరిగాయని, దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీకి ఎన్వోసీ ఇప్పించాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. అలాగే 111 జీవో పరిధిలోని జనవాడలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేయించాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ ను తంబాకు టెస్ట్ కు తీసుకొస్తా దమ్ముంటే డ్రగ్ టెస్ట్ కు వస్తావా? అని కేటీఆర్ ను ఛాలెంజ్ చేశారు అర్వింద్.

Tags:    

Similar News