Telangana: తెలంగాణలో మంకీపాక్స్ కలకలం
Telangana: కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన వ్యక్తికి లక్షణాలు
Telangana: తెలంగాణలో మంకీపాక్స్ కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో అతడిని హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. బాధితుడు ఈ నెల 6న కువైట్ నుంచి రాగా 20వ తేదీ నుంచి అతడికి జ్వరం, 23వ తేదీన రాషెస్ రావడంతో మరుసటి రోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి, కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి ఆ వ్యక్తిని 108లో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి షిప్ట్ చేస్తున్నట్టు డాక్టర్లు స్పష్టం చేశారు. శాంపిల్స్‌ను సేకరించి, పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. అప్పటివరకు బాధితుడిని ఫీవర్ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన వారిని గుర్తించామని, వారెవరికీ మంకీపాక్స్ లక్షణాలు లేవని, అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేసినట్టు స్పష్టం చేశారు డాక్టర్లు.