Patnam Narender Reddy: అందుకే నాపై కేసులు పెట్టారంటున్న పట్నం
Patnam Narender Reddy: రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే ప్రారంభం అవుతుందని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.
Patnam Narender Reddy: రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే ప్రారంభం అవుతుందని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. రైతులకు మద్దతిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటెలీజెన్స్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే తనపై కేసులు బనాయించారని ఆరోపించారు. లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ను విచారణ కోసం పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా వికారాబాద్ పోలీసులు కోర్టును కోరారు. అయితే, కొడంగల్ కోర్టు ఈ కస్టడీ పిటిషన్‌ను 22వ తేదీకి వాయిదా వేసింది.
పిటిషన్ వాయిదా అనంతరం పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే కోర్టు నుండి బయటకి వస్తూ ఆయన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. తానే మరోసారి రేవంత్ రెడ్డిని ఓడించి కొడంగల్ నుండే ఆయన పతనానికి నాంది పలుకుతానని పట్నం అన్నారు.