Traffic restrictions in Hyderabad: హైదరాబాద్ వాహనాదరులకు అలర్ట్..రెండ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..ఎందుకంటే?

Traffic restrictions in Hyderabad: హైదరాబాద్ లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీస్ కమిషనర్ పి. విశ్వప్రసాద్ తెలిపారు.

Update: 2024-11-21 02:58 GMT

Traffic restrictions in Hyderabad

Traffic restrictions in Hyderabad: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నేడు హైదరాబాద్ కు రానున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నగరంలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. నగరంలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీస్ కమిషనర్ పి. విశ్వప్రసాద్ తెలిపారు.

నేడు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్ ల్యాండ్ జంక్షన్, బేగంపేట ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, పీపీఎన్టీ ఫ్లైఓవర్, హెచ్ పీఎస్ ఔట్ గేట్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్‌ భవన్‌ రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, నెక్లెస్‌ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్‌ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్‌ మినార్,ఎయిర్ పోర్టు, వై జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్, అశోక్‌నగర్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

ఈనెల 22న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, కొత్తగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 85004 11111 అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొకుండా ముందు జాగ్రత్త ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపారు.

కాగా ఇవాళ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటీ దీపోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 15వందల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News