Janwada Farm House Case: అజ్ఞాతంలో రాజ్ పాకాల.. విచారణకు రాకపోతే...
ఒకవేళ విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని పోలీసుటు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.
Janwada Farm House Case: రాజ్ పాకాల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతని మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఓరియన్ విల్లాకు మరోసారి పోలీసులు వచ్చి తనికీలు చేపట్టారు. అయితే నేడు రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ రాజ్ పాకాల కనిపించకపోవడంతో రాజ్ పాకాలకు చెందిన విల్లా నంబర్ 40కి పోలీసులు నోటీసులు అంటించారు.
ఒకవేళ విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని పోలీసుటు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా BNSS సెక్షన్ 35(3),(4),(5),(6) కింద రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు.
జన్వాడ ఫామ్‌హౌజ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మోకిల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో A1 గా రాజ్ పాకాలా.. A2గా విజయ్ మద్దూరి పేరులను చేర్చారు. మరోవైపు రాజ్‌పాకాలా ఇంట్లో మొదటి రోజు సోదాలు ముగిశాయి. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఓరియన్ విల్లాస్‌లో విల్లా నంబర్ 5, 40, 43, లలో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు... 53 విదేశీ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. 49 స్కాచ్ బాటిల్స్.. 2 బీర్లు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే విదేశీ మద్యం దొరకడంతో.. 34(a), 34(1), 9(1) ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు.