MLC Kavitha: బీఆర్ఎస్‌ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్‌ అంటే అహంకారం

MLC Kavitha: ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మీయతకు మధ్య జరుగుతున్నాయి

Update: 2023-11-09 02:08 GMT

MLC Kavitha: బీఆర్ఎస్‌ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్‌ అంటే అహంకారం

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరు కావాలో ఆలోచన చేసి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బోధన్ నియోజకవర్గం గౌడ ఆత్మీయ సమ్మేళన సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి, ముదిరాజుల పెద్దమ్మ తల్లి దేవాలయానికి కాంగ్రెస్‌ హయాంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ దేవతల ఆలయాలకు 10 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు ఎమ్మెల్సీ కవిత.

Tags:    

Similar News