Telangana: ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Telangana: తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.

Update: 2021-12-10 04:32 GMT
MLC Elections Polling Started in Telangana

Telangana: ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలిం

  • whatsapp icon

Telangana: తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. నిర్మల్‌లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మంత్రితో పాటు ఓటు వేసేందుకు మున్సిపల్ చైర్మన్‌ ఘంటా ఈశ్వర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు చేరుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 8 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 9వందల 37 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాలులో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో 7వందల 68 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Full View


Tags:    

Similar News