Tummala On RunaMafi: రుణమాఫీ కానీ రైతులందరికీ గుడ్‎న్యూస్ చెప్పిన మంత్రి..ఈ పనిచేస్తే చాలు అంటూ కీలక అప్‎డేట్

Tummala On RunaMafi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కొటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే రైతురుణమాఫీ చేసి రైతులతో శభాష్ అనిపించుకుంటుంది. తొలివిడతలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసింది. అయితే కొందరు రైతులకు మాత్రం మాఫీ కాలేదు. అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కీలక ప్రకటన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Update: 2024-07-22 05:57 GMT

Tummala On RunaMafi: రుణమాఫీ కానీ రైతులందరికీ గుడ్‎న్యూస్ చెప్పిన మంత్రి..ఈ పనిచేస్తే చాలు అంటూ కీలక అప్‎డేట్

Tummala On RunaMafi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కొటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే రైతురుణమాఫీ చేసి రైతులతో శభాష్ అనిపించుకుంటుంది. తొలివిడతలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసింది. అయితే కొందరు రైతులకు మాత్రం మాఫీ కాలేదు. అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కీలక ప్రకటన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ అధికారులను కలిస్తే..వారి సమస్యకు పరిష్కారం దొరకుతుందంటూ చెప్పుకొచ్చారు.

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ జులై 18వ తేదీన రూ. లక్షలోపు పంటరుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి రైతుల అకౌంట్లోకి మాఫీ చేసిన సొమ్మును జమ చేశారు. ఆగస్టు 15వ తేదీ లోపు మొత్తం రూ. 2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. కాగా తొలివిడతలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేశారు. మొత్తం 11.50లక్షల మంది రైతుల అకౌంట్లోకి దాదాపు రూ. 6వేల కోట్ల నిధులు జమ అయ్యాయి. అయితే కొందరు రైతులు మాత్రం రుణమాఫీ జరలేదని ఆందోళన చెందుతున్నారు. రూ. లక్షలోపే వారి పంట రుణాలు ఉన్నా..వారికి మాత్రం మాఫీ కాలేదు. దీంతో ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై కీలక అప్ డేట్ ఇచ్చారు. 

రూ.లక్షలోపు రుణమాపీ జరగని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. వారికి కూడా రుణమాఫీ జరిగే విధంగా చూస్తామని చెప్పారు. డబ్బులు అకౌంట్లో జమకాని రైతులు తమ మండల వ్యవసాయాధికారిని కానీ, విస్తరణాధికారిని కానీ కలవాలని సూచించారు. అధికారులకు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే పరిశీలించి సరైన సమాచారం అందిస్తారని చెప్పారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతుల వేదికల దగ్గర అధికారులు ఉంటారని మంత్రి సూచించారు. అక్కడే సమస్యను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఆధార్ కార్డులు సరిగ్గా లేనివారి దగ్గర ఇతర ఆధారాలు ఉంటే వాటిని పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు. మొదటి విడతగా రూ. లక్షలోపు రుణమాఫీ కోసం రూ. 11.50లక్షల రైతులకు రూ. 6,098 కోట్లు నిధులు విడుదల చేశామని మంత్రి తెలిపారు. దాదాపు 99శాతం మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..రాష్ట్రంలోని 25లక్షలకుటుంబాలకు చెందిన దాదాపు 44 లక్షల మంది రైతులకు రూ. 2లక్షల వరకు రుణమాఫీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. రుణమాఫీకి ముందుగా తెల్లరేషన్ కార్డుల ప్రాతిపదికన కుటుంబాలను గుర్తించినట్లు మంత్రి చెప్పారు. ఈ నెలాఖరుకు రెండో విడత, ఆగస్టు 15వ తేదీ లోపు మూడో విడతలో వందశాతం మంది రైతులకు రూ 2లక్షల రుణాలు మాఫీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.

Tags:    

Similar News