Jobs In Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే 2లక్షల ఉద్యోగాల భర్తీ
Jobs In Telangana:
Jobs In Telangana:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రానున్న రోజుల్లో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. 2లక్షల ఉద్యోగాలు కల్పించినా మరో 20లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారన్నారు. ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యంకాదన్నారు మంత్రి
పరిశ్రమలకు కావాల్సిన స్కిల్స్ గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయన్నారు. నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశ్యంతో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ స్థాపన జరుగుతోందని మంత్రి తెలిపారు. అన్ని కోర్సులకు 50శాతం ప్రాక్టికల్ కాంపొనెంట్ ను కలిగి ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
కాగా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తుందని రాష్ట్ర డెవలప్ మెంట్ పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్ వర్సిటీ ఊతమిస్తున్నట్లు తెలిపారు. 2024-25 ఏడాదిలో 2000 మంది విద్యార్థులకు వచ్చే ఏడాది 10వేల మందికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని మంత్రి కోరారు.