Telangana: కేటీఆర్ వర్సెస్ సీతక్క.. అసెంబ్లీలో 'కోట శ్రీనివాసరావు' ప్రస్తావన..

Telangana Assembly: శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌యం బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బిల్లులపై చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-07-31 07:27 GMT

Telangana: కేటీఆర్ వర్సెస్ సీతక్క.. అసెంబ్లీలో 'కోట శ్రీనివాసరావు' ప్రస్తావన..

Telangana Assembly: శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌యం బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బిల్లులపై చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చటం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని చెప్పారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టించటం సరైంది కాదన్నారు. సభ వాయిదా పడగానే సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ వెళ్దామని.. ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు అక్కడి నిరుద్యోగులు చెప్పినా.. తాను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని డిప్యూటీ సీఎం భట్టికి సవాల్ విసిరారు.

ఉద్యోగాల అంశంపై అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో.. గత పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో ఇంటికో ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ యువతను మోసం చేసిందని ధీటుగా బదులిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్ల కాలంలో అడుగుపెట్టలేని పరిస్థితి తెచ్చుకున్నారని సీతక్క ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను.. కోట శ్రీనివాస్ రావు కోడి కథలా ఉందని సీతక్క సెటైర్ వేశారు. 

Full View


Tags:    

Similar News