Indiramma Houses: పేద ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు..ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన
Indiramma Houses:తెలంగాణలోని పేద ప్రజలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం తీపికబురు అందించింది.
Indiramma Houses: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజలకు శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి కీలక నిర్ణయం వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వారం రోజుల్లో విధి విధానాలు రూపొందిస్తామని రాష్ట్ర గ్రుహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి సోమవారం పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ అభివ్రుద్ధి సమీక్షా సమావేశంలో అర్హుల కోసం డబుల్ బెడ్ రూమ్స్ గదుల ఇళ్ల పంపిణీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
దీంతోపాటుగా అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వీటిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత కొన్నేండ్లుగా రాష్ట్ర ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వారందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు.
సొంతగా స్థలం ఉండి ఇండ్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు మంజూరు చేయనున్నారు. ఇక సొంతగా స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం కింద రూ. 5లక్షలు అందిస్తామని మంత్రి వెల్లడించారు.