Ponguleti: పాలేరు సాగర్ కాలువ నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి
Ponguleti: నీరు విడుదల చేసిన గంట తర్వాత కూలిపోయిన యూటీ, అండర్ కెనాల్
Ponguleti: పాలేరు వద్ద సాగర్ కాలువ నీటి ప్రవాహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కూసుమంచి మండలం పాలేరు వద్ద సాగర్ కాలువకి నీటిని విడుదల చేసిన గంటలోపే యూటీ, అండర్ కెనాల్ ఒక్క సారిగా కుప్పకూలడం బాధాకరమని అన్నారు. కాలువ పునః నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నాలుగు రోజులు ఆలస్యం అయ్యిందన్నారు.
కాలువ పునః నిర్మాణ పనులని పూర్తి చేసి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అన్నారు. అంచలంచెలుగా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని అన్నారు. సాగర్ కాలువ ఆయకట్టు క్రింద చివరి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హమీ ఇచ్చారు.