మహిళలతో డ్యాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
Preeti Reddy: అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయాలి
Preeti Reddy: మేడ్చల్ నియోజకవర్గ పరిధి బొడుప్పల్‌లో బీఆర్ఎస్ పార్టీ మహిళా గర్జన ఏర్పాటు చేసింది. ఈ మహిళా గర్జనలో మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు.. ఈ గర్జనలో పాల్గొన్న మహిళలతో మంత్రి మల్లారెడ్డి కోడలు బోనం ఎత్తుకొని డ్యాన్స్ వేసి ఉత్సాహ పరిచారు... ఈ సందర్భంంగా ప్రీతిరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కథలు చెప్పినా నమ్మొద్దన్నారు.. తనకు మామ అయినా... తండ్రి అయినా.. మంత్రి మల్లారెడ్డేనని, బోడుప్పల్ బిడ్డగా మీ ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించి, మల్లారెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు.