బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి
*ట్రిపుల్ ఐటీ విద్యార్థులందరికీ 2 నెలల్లో ల్యాప్‌టాప్‌లు అందజేస్తాం- కేటీఆర్
Minister KTR: గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మంత్రి కేటీఆర్ కొనియాడారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులే ఆందోళన చేయడం నచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా 'మీ అంతట మీరే ఆందోళన' చేయం బాగుందని కేటీఆర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 3 కోట్ల రూపాయలతో ట్రిపుల్ ఐటీలో మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, మోడ్రన్ తరగతి గదులను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విద్యార్థులకు త్వరలోనే ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు.