KTR: కేసీఆర్ పాలనలో నగరంలో ఎలాంటి మత ఘర్షణలు లేవు
KTR: కేసీఆర్ పాలనలో నగరంలో ఎలాంటి మత ఘర్షణలు లేవు
KTR: దేశంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేది.. కానీ తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. కేసీఆర్ పాలనలో నగరంలో ఎలాంటి మత ఘర్షణలు లేవని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.