భాగ్యనగరం అని పేరు మారిస్తే.. బంగారం అయిపోతుందా: కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ అభివృద్ధికోసం నిజంగా శ్రమించేది టీఆర్ఎస్ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్

Update: 2020-11-27 14:02 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ అభివృద్ధికోసం నిజంగా శ్రమించేది టీఆర్ఎస్ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్.. తెలుగు రాష్ట్రాలను మోసం చేసిన బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లడిగేందుకు వచ్చిందో నిలదీయాలన్నారు. భాగ్యనగరం అని పేరు మారిస్తే హైదరాబాద్ బంగారంలా మారిపోదని, నిరంతరం కర్ఫ్యూ, అల్లర్లు ఉంటే పెట్టుబడులు రావనీ అన్నారు. కేవలం టీఆర్ఎస్ మాత్రమే ప్రజలందరికీ సుఖమైన, సౌకర్యవంతమైన పాలన ఇవ్వగలదన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో సమస్యలున్నమాట వాస్తవమేనని, ఏ సంస్కరణ చేపట్టినా ముందు సమస్యలు రావడం సహజమనీ అన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు పాత విధానాన్నే కొనసాగిస్తామన్నారు మంత్రి. అటు గ్రేటర్ లో డిసెంబర్ 01న ఎన్నికలు జరగనుండగా, 04న ఫలితాలు రానున్నాయి.

Tags:    

Similar News