ఆడబిడ్డల ఆరోగ్యానికి మంత్రి హరీష్ అభయం.. రుతు ప్రేమ పేరుతో నూతన కార్యక్రమం...

Harish Rao: మహిళలకు శానిటరీ కప్స్, ప్యాడ్‌ల ఉచిత పంపిణీ...

Update: 2022-04-13 07:46 GMT

ఆడబిడ్డల ఆరోగ్యానికి మంత్రి హరీష్ అభయం.. రుతు ప్రేమ పేరుతో నూతన కార్యక్రమం...

Harish Rao: ఆడబిడ్డల ఆరోగ్యానికి అభయం ఇచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలో మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం రుతు ప్రేమ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు, బాలికలకు రుతుస్రావ శానిటరీ కప్స్, బట్ట డైపర్లు, ప్యాడ్‌లు ఉచితంగా పంపిణీ చేశారు. సిద్దిపేట వేదికగా నూతన ఒరవడికి నాంది పలికారు. దేశంలోనే తొలిసారిగా సిద్ధిపేటలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ రుతు ప్రేమపై హెచ్‌ఎం టీవీ స్పెషల్ స్టోరీ...

మంచి ఆరోగ్యం, డబ్బులు ఆదా, పర్యావరణ పరిరక్షణకై సిద్దిపేటలో మహిళలు సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రోగ్రాం ప్రారంభం కాగా... ర్యాష్ ఫ్రీ, క్యాష్ ఫ్రీ, ఫీల్ ఫ్రీ అనే నినాదంతో రుతు ప్రేమ కార్యక్రమాన్ని షురూ చేశారు. సిద్దిపేటలోని ఐదవ వార్డులో శానిటరీ కప్స్, బట్ట డైపర్‌లు, ప్యాడ్‌లను ఉచిత పంపిణీ చేశారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలకు పీరియడ్స్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు.

రసాయనిక శానిటరీ ప్యాడ్‌లను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సిలికాన్ శానిటరీ కప్స్, క్లాత్ ప్యాడ్‌లను వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వెల్లడించారు. శానిటరీ కప్స్‌ను వాడటం వలన ఆరోగ్యంతో పాటు డబ్బు ఆదా చేయవచ్చని వెల్లడించారు. ఇదో మార్పుకు నాంది కావాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. రాష్ట్రంలో తొలి ప్రక్రియగా సిద్దిపేటలో మొదలైన రుతు ప్రేమ అక్కడితో ఆగొపోవద్దని ఆశించారు.

జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరారు. వైద్యులకు మహిళలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. చాలా మంది అమ్మాయిలు క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని జయించే ధైర్యం లభించక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ హద్దులను చెరిపివేసి ఆమెకు ఆరోగ్యం కల్పించే దిశగా సిద్దిపేటలో అడుగులు పడటం సంతోషించదగ్గ విషయం. అయితే దీనిపై వైద్యులు మహిళలందరికీ అవగాహన కల్పించాల్సి అవసరం ఉంది.

Tags:    

Similar News