AIMIM: ఎంఐఎం పోటీ ఎవరికి లాభం..?

AIMIM: తొమ్మిది స్థానాలపై గురి పెట్టిన ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

Update: 2023-11-04 16:00 GMT

AIMIM: ఎంఐఎం పోటీ ఎవరికి లాభం..? 

AIMIM: హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ గేరు మార్చిందా..? నగరంలో ఏడు స్థానాలకే పరిమితం అయిన ఎంఐఎం పార్టీ తొమ్మిది స్థానాలకు పాగా వేయాలని ప్లాన్ చేస్తుందా..? జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో పోటీ చేస్తామాని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటి..? ఉన్నపళంగా ఎంఐఎం పార్టీ ఏడు నుంచి తొమ్మిది స్థానాలకు స్ట్రాటజీ ఎందుకు మార్చింది.? మరి ఈసారి 9 స్థానాల్లో పతంగి ఎగురుతుందా..? ఈ రెండు సీట్లలో ఎంఐఎం పోటీతో ఎవరికి లాభం చేకూరనుంది..?

తెలంగాణలో హైదరాబాద్ నగరానికే పరిమితం అయిన ఎంఐఎం పార్టీ కొత్త నిర్ణయం తీసుకుంది. గేరు మార్చి మరో రెండు స్థానాలపై పట్టు కోసం పట్టుపడుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పతంగి మరింత పైకి ఎగరలానే ఈ స్థానాల్లో పోటీ చేస్తుందా..? లేక రాజకీయ వ్యూహాల్లో భాగమా... ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇప్పటిదాకా చార్మినార్, నాంపల్లి, కార్వాన్, చంద్రయాణ్ గుట్ట, మలక్ పేట, బహదూర్ పురా, యాకత్ పురా లో మాత్రమే ఎంఐఎం పాగా వేయగా.. ఇప్పుడు కొత్తగా జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్ స్థానాలపై ఫోకస్ పెట్టింది.

పాత ఏడుస్థానాల్లో హైదరాబాద్ పార్లమెంట్ పరిధికాగా... నాంపల్లి మాత్రం సికింద్రాబాద్ పరిధిలో ఉండేది... ఇప్పుడు జూబ్లిహిల్స్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి కాగా... రాజేంద్రనగర్ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కి వస్తుంది. మొత్తంగా మూడు ఎంపీ స్థానాల్లో మూడు పార్టీల నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే.. గతంలో జూబ్లిహిల్స్ నుంచి 2014లో నవీన్ యాదవ్ ను ఎంఐఎం పోటీలో దింపింది. 40 వేల ఓట్లు సాధించగా... 10 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాధ్ పై ఓటమి పాలయ్యారు. 2018 లో బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీఆర్ఎస్ కే వదలిలేసింది. సేమ్ టైంలో రాజేంద్రనగర్ లో 2018 ఎన్నికల్లో ఎంఐఎం బరిలోదిగి మూడో స్థానంలో నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్ల అధికంగా ఉండటంతో.. మజ్లిస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. దీనికి తోడు గతంలో ఫ్రెండ్లీ పోటీ నేపథ్యంలో చేజార్చుకున్న రెండు స్థానాలను తిరిగి దక్కించుకోవాలన్న పట్టుతో మజ్లిస్ అడుగులేస్తుంది.

ఇదంతా ఒకెత్తు అయితే.. ఎంఐఎం పోటీ చేయబోయే స్థానాలను తెర వెనక నుంచి బీఆర్ఎస్ డైరెక్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి వ్యతిరేకత పెరిగినందువల్ల.. ఆఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ కు ప్లస్ కాకుండా.. ఓట్లను చీల్చాలన్న వ్యూహంతోనే ఈ రెండు స్థానాల్లో పతంగిని ఎగరేయాలని తెరచాటు రాజకీయం నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు నామినేషన్ల తొలిరోజు వరకూ తొమ్మిది సీట్లలో పోటీ చేస్తామన్నట్టు ఆ పార్టీ ప్రకటించనే లేదు. నామినేషన్ల తేదీ రోజే సర్వే నివేదిక మేరకు మజ్లిస్ ఈ నిర్ణయం తీసుకుందా..? అన్న అనుమానాలు రాజకీయ వేత్తల్లో మెదులుతున్నాయి. మరి గతంలో పోటీ చేసిన వారినే బరిలోకి దింపి.. రెండు స్థానాల్లో పతంగి పైకి ఎగురుతుందా... అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News