ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లో కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్-MIDHANI సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మిధానిలో మొత్తం 158 ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి ఏడాది కాలవ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టుల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది మిధాని. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 16 చివరి తేదీ.
ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలని తెలిపారు. వివరాల కోసం మిధాని అధికారిక వెబ్‌సైట్ https://midhani-india.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు. మిగిలిన అన్ని అర్హతలను అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధులు అప్లికేషన్ ఫామ్ ను పైన తెలిపిన సైట్ నుంచి ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా అంటే అక్టోబర్ 16 లోగా పంపించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు...
మొత్తం ఖాళీలు- 158
ఎలక్ట్రీషియన్- 48మెషినిస్ట్- 20
ఫిట్టర్- 50
వెల్డర్- 20
టర్నర్- 20
ముఖ్యమైన తేదీలు
అక్టోబర్ 16 -2020 దరఖాస్తులకు చివరి తేదీ
ఎంపిక విధానం
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, మెరిట్ లిస్ట్
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా
Deputy Manager (TIS & Apprenticeship Training),
Mishra Dhatu Nigam Limited,
Kanchanbagh, Hyderabad – 500058.