మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పూజలు
Medak: ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న వెంకట్రామిరెడ్డి
Medak: మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానంటూ దీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి. మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తానన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఒక కుటుంబసభ్యుడిగా పనిచేస్తానని అన్నారు.